టీం ఇండియాకు దెబ్బ మీద దెబ్బ
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా మొదట జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెల్సిందే.అద్బుతమైన విజయాలను సొంతం చేసుకున్న టీం ఇండియా కొంత అప్రదిష్టను కూడా మూటకట్టుకుంది.
చివరి రెండు మ్యాచ్‌లలో స్లో ఓవర్ ఫెనాల్టీని చవి చూడాల్సి వచ్చింది.టీ20లు పూర్తి అయ్యి వన్డే సిరీస్ మొదలు అయ్యింది.
టీ20ల్లో అద్బుతమైన విజయాలను దక్కించుకున్న టీం ఇండియాకు వన్డేలకు వచ్చేప్పటికి దెబ్బ పడిరది.మొదటి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది.
టీం ఇండియాకు ఇది పెద్ద దెబ్బ.సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజలో ఉండటంతో ఇండియాకు దెబ్బ పడిరది.
ఇదే సమయంలో మొదటి వన్డేలో నాలుగు ఓవర్లను ఆలస్యంగా వేశారంటూ ఐసీసీ టీం ఇండియా ఆటగాళ్లకు ఏకంగా 80 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు.ఓవర్‌కు 20 శాతం చొప్పున ఈ కోత విధించినట్లుగా ప్రకటించారు.
కోహ్లీ పదే పదే బౌలర్లను మార్చడంతో పాటు ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉండటం వల్ల బౌలింగ్ ఆలస్యం అయినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

No comments: