రాత్రి పూట చపాతీలు తింటున్నారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్దతి.రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు.
డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు.కాకపోతే చపాతి తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి.అసలు నూనే వేయకుంటే మరింత మంచిది.
ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు.అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది.
శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతిల్లో కొవ్వు పదార్థాలు ఉండవు.ఎందుకంటే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు.వాటిల్లో ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి.గోదుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
రాత్రి పూట చపాతీలు తింటున్నారా.?
Reviewed by City Marketplace
on
February 05, 2020
Rating:
Reviewed by City Marketplace
on
February 05, 2020
Rating:


No comments: